: తిరుమలకు పోటెత్తిన వీఐపీలు
తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఉదయం పలువురు వీఐపీలు వచ్చారు. వీరందరూ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దేవదేవుని దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్ రావు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తదితరులు స్వామి దర్శనానికి వచ్చారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.