: తెలంగాణలో ఉద్యోగ మేళా...దండుకుంటున్న కోచింగ్ సెంటర్లు...దళారుల రంగప్రవేశం!


ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం పట్టేయాలి. తెలంగాణలో ఏ నిరుద్యోగిని కదిలించినా ఇదే మాట వినిపిస్తోంది. భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కారు తొలి విడతగా నేడో రేపో 15 వేల ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో సర్కారీ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉండటంతో పోటీ తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం ఏదైనా 'పోస్టు గ్యారెంటీ' అంటూ కోచింగ్ సెంటర్లు వేలాది రూపాయలను ఫీజులుగా వసూలు చేస్తున్నాయి. నోటిఫికేషన్ రాకముందే మూడు నెలల కోచింగ్ అంటూ, రూ. 12 వేల నుంచి రూ. 25 వేల వరకూ దండుకుంటున్నాయి. గ్రూప్-2, జూనియర్ లెక్చరర్, కానిస్టేబుల్, ఎస్ఐ, టీచర్ ఇలా ఏ పోస్టుకు పోటీ పడాలన్నా ఒకే రకంగా కోచింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గ్రామీణ అభ్యర్థులకు లైబ్రరీలే దిక్కవుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ దళారులు ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ నిరుద్యోగులతో బేరాలకు దిగుతున్నారు. ఒక్కో పోస్టుకు రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకూ అవుతుందని, దానికి సిద్ధమైతే ఉద్యోగం వచ్చినట్టేనని ఆశలు పెడుతున్నారు. దళారుల మాటలు నమ్మవద్దని అధికారులు చెబుతున్నా, వీరి వలలో పడుతున్నవారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News