: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్ ఇదే!
అత్యంత ఖరీదైన వైన్ ను తయారుచేసిన ఘనత ఎప్పటిలానే ఫ్రాన్స్ లోని బుర్గుండీ ప్రాంతానికి దక్కింది. ఇక్కడి హెన్రీ జేయెర్ రిచీబౌర్గ్ రూపొందించిన గ్రాండ్ క్రూ వెరైటీ వైన్ ధర రూ. 9.56 లక్షలు పలికింది. ప్రపంచంలో వైన్ కు పలికిన అత్యధిక ధర ఇదే! అత్యంత ఖరీదైన 50 రకాల ద్రాక్షసారాయి రకాలను 'వైన్ సెర్చర్ డాట్ కామ్' వెలువరించింది. ఈ జాబితాలోని తొలి మూడు స్థానాలనూ బుర్గుండీ ప్రాంతమే దక్కించుకుంది. ఇక్కడ తయారయ్యే రోమానీ-కౌంటీ వైన్ రెండవ స్థానంలో నిలిచిందని వైన్ సెర్చర్ వెల్లడించింది.