: జార్ఖండ్ లో దారుణం, మంత్రగత్తెలంటూ ఐదుగురు మహిళల హత్య
క్షుద్రవిద్యలు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ, జార్ఖండ్ లోని రాంచీ జిల్లా కుంజియా గ్రామంలో ఐదుగురు మహిళలను దారుణంగా కొట్టి చంపారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు యువతులు చనిపోవడం, ఇందుకు చేతబడులే కారణమని గ్రామస్తులు నమ్మడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఐదుగురు మహిళలను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి, పదునైన ఆయుధాలతో కొట్టి చంపారు. ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన పోలీసుల ఎదుటా నిరసన తెలిపారు. ఈ కేసులో 50 మందిని నిందితులుగా గుర్తించామని, 27 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, 2001 నుంచి 2012 మధ్య ఇదే తరహాలో 400కు పైగా హత్యలు జరిగినట్టు తెలుస్తోంది.