: జూబ్లీహిల్స్ రోడ్లపై కొండచిలువ పిల్లలు
ఎక్కడి నుంచి వచ్చాయో? ఏ తల్లికి పుట్టాయో? నాలుగు కొండచిలువ పిల్లలు హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లో రోడ్లపైకి వచ్చాయి. ఓ కొండచిలువ పిల్లయితే, ఏకంగా ఓ కారు బంపర్ లోకి దూరిపోయింది. ఈ ఘటన గత రాత్రి జరిగింది. వీటిని చూసిన స్థానికులు స్నేక్ ఫ్రెండ్స్ సొసైటీకి సమాచారాన్ని పంపించారు. దీంతో స్పందించిన వారు వీటిని జాగ్రత్తగా పట్టుకున్నారు. అటవీశాఖ నుంచి అనుమతి తీసుకుని వీటిని దట్టమైన అడవుల్లో విడిచిపెడతామని వారు తెలిపారు. కాగా, వీటి తల్లి ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉండవచ్చని ప్రజలు భయాన్ని వ్యక్తం చేశారు. అది ఎక్కడ ఉందో గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కొండచిలువ పిల్లల్ని పలువురు వీడియోలు, ఫోటోలు తీశారు.