: ఒవైసీ సోదరులు ముస్లిం యువకులను తప్పుదోవ పట్టిస్తున్నారు: యూపీ మాజీ గవర్నర్ ఖురేషీ
ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషి ఎంఐఎం అధినాయకత్వంపై ధ్వజమెత్తారు. ఒవైసీ సోదరులు రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా దేశంలోని ముస్లిం యువకులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. భారతీయ ముస్లింలకు ఒవైసీ సోదరులు అతి పెద్ద శత్రువులని విమర్శించారు. హిందువులు ముస్లిం వ్యతిరేకులన్న భావాలను వ్యాప్తి చేయడం, మతతత్వాన్ని నూరిపోయడం వారికి అలవాటని అన్నారు. ఆగ్రాలోని ఓ కళాశాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఖురేషి మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు. భారత్ లో ఐఎస్ఐ ఏజెంట్లున్నారని, వారికి శిరచ్ఛేదం చేయాలని వ్యాఖ్యానించారు.