: మునికోటి ఆత్మహత్యాయత్నం బాధించింది: జగన్
తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పోరు సభలో ఓ కార్యకర్త ఆత్మాహుతి యత్నంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. మునికోటి ఆత్మహత్యాయత్నం బాధించిందని అన్నారు. అతడి ప్రాణాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. హామీలు విస్మరించిన ప్రభుత్వాలు తిరుపతి ఘటనతోనైనా కళ్లు తెరవాలని అన్నారు.