: రఘువీరాకు సోనియా ఫోన్
ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్ చేశారు. తిరుపతిలో ఓ కార్యకర్త ఆత్మ బలిదానానికి యత్నించడంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై రఘువీరాను అడిగి వివరాలు తెలుసుకున్న ఆమె ప్రత్యేక హోదాపై ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తిరుపతి ఘటనపై పార్లమెంటులో అధికార పక్షాన్ని నిలదీస్తామని తెలిపారు. ఆత్మాహుతికి యత్నించిన మునికోటి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉందామని ఆమె రఘువీరాతో అన్నారు.