: యువకుడి ఆత్మాహుతి యత్నంపై చంద్రబాబు స్పందన


తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పోరు సభలో మునికోటి అనే యువకుడు ఆత్మాహుతికి యత్నించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా అంశంలో యువత ఎలాంటి ఉద్రేకాలకు లోనుకారాదని సూచించారు. ఆత్మాహుతికి యత్నంచిన మునికోటికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చుట్టూ ఉన్న మూడు రాష్ట్రాలతో ఏపీని సమానంగా అభివృద్ధి చేసేందుకు శ్రమిస్తున్నామని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News