: పవన్ కల్యాణ్ కు పెద్ద అభిమానిని... ఆయన సినిమాలు చూడకుండా వదలను: అభిషేక్ బచ్చన్


ప్రొ కబడ్డీ లీగ్ కోసం హైదరాబాద్ విచ్చేసిన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు యజమాని, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ మెగా ఫ్యామిలీపై అభిమానాన్ని చాటారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో గౌరవమని, పవన్ కల్యాణ్ కు తాను ఫ్యాన్ ను అని చెప్పుకొచ్చారు. పవన్ సినిమాల్లో దేన్నీ వదలనని తెలిపారు. ఇక, మంచి పాత్ర లభిస్తే టాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందంటూ ఆసక్తి ప్రదర్శించారు. ప్రొ కబడ్డీ గురించి చెబుతూ... హైదరాబాదులో కబడ్డీ కోలాహలం తనను ఆశ్చర్యచకితుణ్ని చేసిందని అన్నారు. కబడ్డీకి మద్దతిస్తున్నందుకు అభిమానులకు, ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు.

  • Loading...

More Telugu News