: దేశానికి నిజమైన సంరక్షకులు వాళ్లే: అమితాబ్
బోర్డర్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించే జవాన్ల జీవితం కత్తి మీద సాములాంటిదని పేర్కొన్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. జవాన్లు దేశానికి నిజమైన సంరక్షకులని కితాబిచ్చారు. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడతారని, మనం రాత్రివేళ ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నామంటే వాళ్లే కారణమని కొనియాడారు. దురాశ కారణంగానే యుద్ధాలు, దురాక్రమణలు, రెచ్చగొట్టే చర్యలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.