: 68 ఏళ్లు దాటాయి... పదవిలో ఉండి ఇంకా ఏం సాధిస్తారు సార్?: వెంకయ్యనాయుడుపై సినీ నటుడు శివాజీ ఫైర్


ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిర్వహించిన సభలో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. కోటి అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ సభలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. రాజకీయాలు పక్కనబెట్టి, అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. ఇంతమంది ఎంపీలుండి ఏం ప్రయోజనం? అని నిలదీశారు. అందరూ కలసి ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై ఆయన నిప్పులు చెరిగారు. "68 ఏళ్లు దాటాయి... ఇంకా ఎందుకు సార్, మీకు పదవిపై ప్రేమ? పదవిలో ఉండి ఏం సాధిస్తారు సార్?" అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రత్యేక హోదాపై ఏమీ చేయకుండా మౌనంగా ఎందుకున్నారని మండిపడ్డారు. ఎంపీలంతా ఏకమైతే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News