: ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం అమానుషం... పవన్ ఇకనైనా మేల్కోవాలి: సినీ నటుడు శివాజీ


ప్రత్యేక హోదా కోసం తిరుపతి సభలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ స్పందించారు. హోదా కోసం ఆత్మహత్యాయత్నం జరగడం అమానుషమన్నారు. ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పొడద్దని కోరారు. హోదాను పోరాటం ద్వారా సాధించుకుందామన్నారు. రాబోయే తరాల కోసం ప్రత్యేక హోదా కావాలని శివాజీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా చారిత్రక అవసరమని, నేతలు కళ్లు తెరవాలని అన్నారు. తమకు ప్రత్యేక ప్యాకేజీ వద్దని, హోదా మాత్రమే కావాలని తేల్చి చెప్పారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడికి ఏమైనా జరిగితే,పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనతోనైనా పవన్ కల్యాణ్ ఇకనైనా మేల్కోవాలని కోరారు.

  • Loading...

More Telugu News