: రిటైర్మెంటు ప్రకటించిన ఆసీస్ కెప్టెన్ క్లార్క్... యాషెస్ చివరి టెస్టుతో కెరీర్ ముగింపు


యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఘోర పరాజయం అనంతరం ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ రిటైర్మెంటు ప్రకటన చేశాడు. సిరీస్ లో చివరిదైన ఓవల్ టెస్టు అనంతరం క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశాడు. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో మూడో రోజు ఉదయానికే టెస్టు ముగియగా, అనంతరం క్లార్క్ మీడియాతో మాట్లాడాడు. "ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరవుతున్నాను. అయితే, ఇప్పటికిప్పుడే తప్పుకోవడంలేదు. కుర్రాళ్లను ఇలా సిరీస్ మధ్యలో వదిలి వెళ్లాలనుకోవడంలేదు. సిరీస్ లో మరో టెస్టు మిగిలుంది. అదే నా చివరి టెస్టు. బాగా ఆడేందుకే ప్రయత్నించాను. కుర్రాళ్లు కూడా శక్తిమేర ప్రయత్నించారు. కానీ, పరాజయం తప్పలేదు. ఇక తర్వాతి తరం ఆటగాళ్లకు సమయం వచ్చింది. తదుపరి యాషెస్ కు జట్టును సన్నద్ధం చేసే అవకాశం కొత్త కెప్టెన్ కు లభిస్తుంది" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News