: ఈ నెల 15న పట్టిసీమ ఫేజ్-1 ప్రారంభిస్తాం: ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల
పట్టిసీమ ఫేజ్-1ను ఈ నెల 15న ప్రారంభిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇది ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక 10వ తేదీన విశాఖపట్నంలో 'మీ భూమి- మీ ఇంటి' కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రే ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజున జియోమి ఫోన్ల కంపెనీ ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొంటారన్నారు. ఇక 15వ తేదీ తరువాత విజయవాడతో పాటు, కొన్ని జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తారని పరకాల వివరించారు.