: జగన్ దీక్షకు సీపీఎం, సీపీఐలు మద్దతు పలికాయి: బొత్స


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడం కోసం తమ అధినేత జగన్ ఎల్లుండి ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు సీపీఎం, సీపీఐలు మద్దతు పలికాయని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. వైకాపా చేయనున్న దీక్ష రాజకీయ స్వార్థంతో చేస్తున్నది కాదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే రాజకీయాలను సైతం పక్కనబెడతామని... ఏ పార్టీ వచ్చినా కలుపుకుపోతామని చెప్పారు. ఎల్లుండి చేపట్టనున్న దీక్షకు ఐదు వేల మంది హాజరవుతారని తెలిపారు. రాజకీయ వ్యాపారంలో మునిగిపోయిన టీడీపీ ప్రత్యేక హోదాను మరచిపోయిందని... అందుకే తాము ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News