: హిమాచల్, బీహార్ లకు కొత్త గవర్నర్ల నియామకం
దేశంలోని రెండు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. హిమాచల్ గవర్నర్ గా ఆచార్య దేవ వ్రత్, బీహార్ గవర్నర్ గా శ్రీరాంనాధ్ కోవింద్ ను నియమించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిలో శ్రీరాంనాథ్ భారతీయ జనతా పార్టీ నేత. 1994-2000, 2000-2006 సంవత్సరాల్లో రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. వృత్తిపరంగా అయన న్యాయవాది.