: లలిత్ మోదీ ఎఫెక్ట్... రైనాకు చేజారిన కెప్టెన్సీ
ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కామెంట్లు పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తున్నాయి. లలిత్ ట్వీట్ల కారణంగా టీమిండియా ఆల్ రౌండర్ సురేశ్ రైనా కూడా భారీ మూల్యమే చెల్లించుకున్నాడట. వివరాల్లోకెళితే... మొన్న జింబాబ్వే టూర్ కోసం సీనియర్లందరికీ విశ్రాంతి కల్పించిన బీసీసీఐ యువజట్టును ఎంపిక చేసింది. ఆ జట్టుకు సురేశ్ రైనాను కెప్టెన్ గా ఎంపిక చేసింది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. ఈ ప్రకటనకు రెండు రోజుల ముందుగా లలిత్ మోదీ చేసిన ట్వీట్లలో రైనాతో పాటు అశ్విన్, డ్వేనీ బ్రేవోల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో సురేశ్ రైనాపై కాస్తంత నమ్మకం సన్నగిల్లిన బీసీసీఐ పెద్ద ఒకరు సెలెక్షన్ కమిటీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి మరీ రైనాకు విశ్రాంతి ఇప్పించారట. ఈ క్రమంలోనే ఎవ్వరూ ఊహించని విధంగా అజింక్యా రెహానేకు జింబాబ్వే టూర్ లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించే ఛాన్స్ దక్కిందట.