: మ్యాగీకి మరో ఎదురు దెబ్బ... లక్నో పరీక్షల్లోనూ ఎంఎస్జీ ఉన్నట్లు తేలిన వైనం
నెస్లేకు ‘మ్యాగీ’ తలనొప్పులు ఇంకా తగ్గలేదు. పిల్లల ఫేవరెట్ ఫుడ్ గా ప్రసిద్ధికెక్కిన మ్యాగీలో నిషేధిత మోనో సోడియం గ్లుటామెట్ (ఎంఎస్జీ) ఉందన్న ఆరోపణలు నిర్ధారణ కావడంతో నెస్లే ఉత్పత్తిపై కేంద్రం నిషేధం విధించింది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకి పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన మ్యాగీ శాంపిళ్లను పరీక్షించిన లక్నో ల్యాబోరేటరీ, వీటిలోనూ నిషేధిత రసాయనాలున్నాయని తేల్చింది. దీంతో మ్యాగీపై నిషేధాన్ని ఎత్తివేయించాలన్న నెస్లే యత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది.