: తెలంగాణ ‘సబ్సిడీ ఉల్లి’ కేంద్రాల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు


ఉల్లి ఘాటు నుంచి ఉపశమనం కల్పిస్తామని బీరాలు పలికిన తెలంగాణ సర్కారు మూడు రోజులకే చేతులు ముడిచేసింది. బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.50కి పెరిగిన నేపథ్యంలో ఏపీ సర్కారు సబ్సిడీ ఉల్లి సరఫరాకు తెరతీసింది. ఏపీ బాటలోనే తెలంగాణ సర్కారు కూడా ‘రూ.20కే కిలో ఉల్లి’ అంటూ ప్రచారం మొదలెట్టింది. ఏపీలో ఒక్కొక్కరికి కిలో ఉల్లి సరఫరా చేస్తే, తాము రెండు కిలోలిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. అయితే నేటి ఉదయం హైదరాబాదులోని కొత్తపేట మార్కెట్ కు వెళ్లిన వినియోగదారులకు ‘సబ్సిడీ ఉల్లి’ కేంద్రాలు షాకిచ్చాయి. ‘నో స్టాక్’ బోర్డులు పెట్టేసిన నిర్వాహకులు దుకాణాలు మూసేశారు. దీంతో ఉసూరుమన్న వినియోగదారులు ఖాళీ సంచులతోనే ఇంటి బాట పట్టారు.

  • Loading...

More Telugu News