: ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న బ్యాంకులు... తుపాకుల బయ్యర్ల లిస్ట్ లో బ్యాంకులదే అగ్రాసనమట


వినడానికి కాస్తంత ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమేనంటున్నారు పోలీసు బాసులు. గడచిన మూడేళ్లలో ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న వారి జాబితాలో బ్యాంకులదే అగ్రాసనమని కూడా వారు చెబుతున్నారు. అయినా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాల్సిన బ్యాంకులకు ఆయుధాలతో పనేమిటనేగా మీ అనుమానం? క్రమంగా పెరుగుతున్న నేర ప్రవృత్తితో బ్యాంకుల సొమ్ము లూటీ అవుతోంది. దీంతో ప్రజలు తమ వద్ద దాచిన సొమ్మను భద్రంగా కాపాడటం కూడా బ్యాంకుల పనేగా. అందుకే బ్యాంకులు ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. ఈ తరహా అడుగులు వడివడిగా వేస్తున్నది ప్రైవేట్ బ్యాంకులు కాదండి బాబూ.. ప్రభుత్వ రంగంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులేనట. కొత్తగా ఆయుధాలు కొనుగోలు చేస్తే, లైసెన్సులు కూడా కొత్తగా తీసుకోవాల్సిందేగా, ఇందులో భాగంగానే తుపాకీ లైసెన్సుల కోసం బ్యాంకులు పోలీసు అధికారుల ముందు క్యూ కడుతున్నాయట. ఈ క్రమంలో మూడేళ్ల నుంచి ఏటా 20 దాకా లైసెన్సులు బ్యాంకులే తీసుకుంటున్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఏటా జారీ అవుతున్న కొత్త గన్ లైసెన్సుల్లో బ్యాంకుల వాటా 50 శాతమని కూడా పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుపాకుల కొనుగోలుదారుల జాబితాలో బ్యాంకులు అగ్రాసనం చేరుకున్నట్లేనన్నమాట.

  • Loading...

More Telugu News