: పశ్చిమబెంగాల్ లో మరో ఘోరం... మంత్రిని సన్మానించనందుకు విద్యార్థి హత్య


పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలు శృతి మించుతున్నాయి. తాజాగా, ఒక మంత్రికి సన్మానం చేయడానికి ఒక విద్యార్థి నిరాకరించడంతో... ఆ పార్టీ మద్దతుదారులు అతన్ని దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యను నిరసిస్తూ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ మిడ్నపూర్ జిల్లా సుబాంగ్ పట్టణంలోని ఓ కాలేజీలో రాష్ట్ర మంత్రిని సత్కరించాలని భావించారు. అయితే, మంత్రిని సన్మానించేందుకు ఒక విద్యార్థి ఒప్పుకోలేదట. దీంతో, ఆ విద్యార్థిని పాశవికంగా హత్య చేశారు. విద్యార్థులపై పట్టు తెచ్చుకోవడానికే అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News