: కేసీఆర్ జిల్లాకో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు... ఢిల్లీలో సోనియాతో ఓయూ విద్యార్థులు
ఢిల్లీ వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాంగ్రెస్ అధిష్ఠానం నేతలతో చర్చలు జరిపారు. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలసిన సమయంలో తెలంగాణలో కేసీఆర్ పాలన, విద్యార్థుల సమస్యలపై వివరించారు. అయితే ఎన్నికల సమయంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు జిల్లాకో ఉద్యోగం కూడా ఇవ్వడంలేదని సోనియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఆమె, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.