: తెలుగు రాష్ట్రాల్లో సమస్యల్లేవు... మీడియానే వాటిని సృష్టిస్తోంది: గవర్నర్
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ తో సమావేశం అనంతరం గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే మీడియానే ఆ రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. మరికాసేపట్లో గవర్నర్ హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితులపై వివరించనున్నారు.