: జస్టిస్ దీపక్ మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం... భద్రత కట్టుదిట్టం
ముంబై వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాది యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష విధించిన సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీలలో ఒకరైన జస్టిస్ దీపక్ మిశ్రాను హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయనకు వ్యక్తిగత భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చారు. బెదిరింపు లేఖపై ఢిల్లీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. యాకుబ్ మెమన్ చివరిసారిగా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో, గత నెల 30న మెమన్ ను ఉరి తీశారు.