: గవర్నర్ ఢిల్లీ పర్యటన షురూ... కేంద్ర హోం శాఖ కార్యదర్శితో భేటీ
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన మొదలైంది. ప్రస్తుతం ఆయన కేంద్ర హోం శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆయన వివరిస్తున్నారు. అనంతరం, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఆయన భేటీ అవుతారు. ఈ రోజు, రేపు రెండు రోజులు నరసింహన్ ఢిల్లీలోనే గడపనున్నారు.