: దత్త గ్రామానికి బయలుదేరిన టీ సీఎం కేసీఆర్


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. జిల్లాలోని హుస్నాబాద్ సమీపంలోని ముల్కనూరు గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల హుస్నాబాద్ లో పర్యటించిన సందర్భంగా ముల్కనూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో కలిసి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముల్కనూరును దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. నెలకోమారైనా గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. నాటి ప్రకటన మేరకే కేసీఆర్ తన దత్త గ్రామ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News