: గూగుల్ డూడుల్ గా 'మౌంట్ బ్లాంక్'


ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత పర్వతం 'మౌంట్ బ్లాంక్'ను అధిరోహించి నేటికి సరిగ్గా 229 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రఖ్యాత సర్చ్ ఇంజిన్ గూగుల్ తన డూడుల్ ను రూపొందించింది. ఈ డూడుల్ ని క్లిక్ చేస్తే... అది మౌంట్ బ్లాంక్ పేజ్ కు తీసుకెళుతుంది. ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఉన్న మౌంట్ బ్లాంక్ ను 1786 ఆగస్ట్ 8వ తేదీన మైఖేల్ గాబ్రియెల్ పక్కార్డ్, జాక్ బాల్మత్ అనే ఇద్దరు వ్యక్తులు తొలిసారిగా అధిరోహించారు. మౌంట్ బ్లాంక్ అంటే తెల్లని పర్వతం అని అర్థం. యూరప్ లో ఇదే అత్యంత ఎత్తైన పర్వతం.

  • Loading...

More Telugu News