: కులీకుతుబ్ షాహి టూంబ్స్ ను సందర్శించిన అమెరికా మిషన్ డిప్యూటీ చీఫ్
అమెరికా మిషన్ డిప్యూటీ చీఫ్ మైఖేల్ పీలేటర్ హైదరాబాదులోని చారిత్రాత్మక కులీకుతుబ్ షాహి టూంబ్స్ ను సందర్శించారు. ఆగాఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుతుబ్ షాహి టూంబ్స్ అభివృద్ధి పనులను చేపడుతుండటంతో ఆయన వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న తరాలకు టూంబ్స్ చరిత్ర తెలిసేలా ఆగాఖాన్ ట్రస్ట్ చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా పురావస్తు శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.