: వంతెనపై నుంచి గాల్లో వేలాడిన ‘భాష్యం’ స్కూల్ బస్సు... ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థులు


నిండా విద్యార్థులతో పాఠశాలకు బయలుదేరిన బస్సు వంతెనపై అదుపు తప్పింది. వంతెన పిట్టగోడను ఢీకొట్టి గాల్లో వేలాడింది. మరికొద్దిసేపు ఉండి ఉంటే, బస్సు వంతెనపై నుంచి కింద పడపోయేదే. అదే జరిగి ఉంటే బస్సులోని పిల్లలకు ఏం జరిగేదో తలచుకోవడానికే భయమేసేది. అయితే అక్కడి సమీపంలోని స్థానికులు వేగంగా స్పందించడంతో బస్సులోని విద్యార్థులంతా సురక్షితంగా బయటపడగలిగారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం మల్లవరంలో కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం సంభవించింది. 35 మంది పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు బయలుదేరిన భాష్యం పబ్లిక్ స్కూల్ బస్సు మల్లవరం వంతెనపై అదుపు తప్పి గాల్లోకి వేలాడింది. వెంటనే స్పందించిన స్థానికులు పిల్లలను బస్సులో నుంచి దింపేశారు. ఆ తర్వాత బస్సును కూడా వంతెనపైకి లాగేశారు.

  • Loading...

More Telugu News