: పుత్తడిపై వడ్డీగా పసిడి వద్దు...ఇకపై నగదు ఇవ్వండి: బ్యాంకులకు టీటీడీ వినతి


తిరుమల వెంకన్నకు భక్తులు కానుకగా ఇచ్చిన బంగారం వేల టన్నులే. ఈ బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది. ఇప్పటిదాకా 4.5 టన్నుల (4,500 కిలోలు) బంగారం బ్యాంకు లాకర్లలోకి చేరింది. దీనిపై ఏటా టీడీడీకి 80 కిలోల బంగారం వడ్డీగా అందుతోంది. తాజాగా మరో టన్ను బంగారాన్ని బ్యాంకులకు తరలించనున్నట్లు టీటీడీ ఈఓ సాంబశివరావు ప్రకటించారు. ఈ సందర్భంగా సాంబశివరావు బ్యాంకుల ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. ఇప్పటిదాకా తాము డిపాజిట్ చేస్తున్న బంగారంపై బంగారాన్నే వడ్డీగా ఇస్తున్నారని పేర్కొన్న ఆయన, ఇకపై వడ్డీగా బంగారం వద్దని చెప్పారు. వడ్డీగా అందుతున్న బంగారానికి బదులుగా నగదును ముట్టజెప్పాలని ఆయన బ్యాంకులను కోరారు. ఈ ప్రతిపాదనపై బ్యాంకులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

  • Loading...

More Telugu News