: హైదరాబాదు చేరుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి టర్కీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అక్కడే వారం పాటు గడిపారు. పూర్తి వ్యక్తిగతమైన ఈ పర్యటనలో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు సహా టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వెళ్లారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఎదిగిన ఇస్తాంబుల్ లో చంద్రబాబు కుటుంబం వారం పాటు ఉల్లాసంగా గడిపింది. ఈ పర్యటన నేపథ్యంలో చంద్రబాబు అక్కడి నుంచే పాలనకు సంబంధించి ఏపీ అధికారులతో రెండు, మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.