: ‘సైకిల్’ బ్రాండ్ అగర్ బత్తీ అంబాసిడర్ గా బిగ్ బీ!
సినిమాలతో పాటు పలు ప్రముఖ కంపెనీల ఉత్పత్తుల ప్రచారంతో భారీగానే ఆర్జిస్తున్న బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తాజాగా మరో ఒప్పందంపై సంతకం పెట్టేశారు. అగర్ బత్తీల తయారీలో దేశంలోనే అతిపెద్ద కంపెనీగా ఎదిగిన 'సైకిల్' అగర్ బత్తీలకు ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సదరు కంపెనీ అమితాబ్ బచ్చన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అగర్ బత్తీల తయారీలో ఇప్పటికే దేశంలో అతిపెద్ద కంపెనీగా ఎదిగిన తాము, రానున్న మూడేళ్లలో తమ మార్కెట్ వాటాను రెండింతలు చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ మార్కెట్ పై దృష్టి సారించిన తాము అమితాబ్ ను ప్రచారకర్తగా నియమించుకున్నామని పేర్కొంది.