: హస్తిన పర్యటనలో గవర్నర్... తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై రాజ్ నాథ్ కు నివేదిక


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. నేడు, రేపు ఆయన అక్కడే ఉంటారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన హోం మంత్రికి ప్రత్యేక నివేదిక సమర్పించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాక ఇరు రాష్ట్రాల మధ్య పలు అంశాల్లో నెలకొన్న వివాదాలనూ ఆయన రాజ్ నాథ్ దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News