: దుమ్మురేపిన తెలుగు టైటాన్స్... పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కైవసం


ప్రొ కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ సత్తా చాటుతోంది. ఇప్పటికే ఏడు మ్యాచ్ లలో విజయం సాధించి, ఓ మ్యాచ్ ను డ్రా చేసుకున్న ఈ జట్టు... నిన్న జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో బలమైన జట్టుగా పేరుగాంచిన పుణేరి పల్టాన్ విజయాన్ని అడ్డుకుంది. ఈ మ్యాచ్ ను కూడా తెలుగు టైటాన్స్ డ్రా చేసుకుంది. దీంతో మొత్తం 11 మ్యాచ్ లు ఆడిన టైటాన్స్ ఏడు విజయాలు, రెండు డ్రాలు, రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బలమైన జట్టుగా ముద్రపడ్డ పుణేరి పల్టాన్ తొలుత విజయం దిశగా సాగినా, టైటాన్స్ ఆటగాళ్లు ఆ జట్టును దీటుగా ఎదుర్కొన్నారు.

  • Loading...

More Telugu News