: ముగిసిన చంద్రబాబు టర్కీ పర్యటన... నేడు హైదరాబాదుకు రాక


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు టర్కీ పర్యటన ముగిసింది. అక్కడి నుంచి మరికొద్దిసేపట్లో తిరుగు పయనం కానున్న ఆయన నేరుగా హైదరాబాదులో ల్యాండ్ కానున్నారు. ఈ నెల 1న కుటుంబంతో కలిసి టర్కీకి వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్లిన చంద్రబాబు వారం పాటు అక్కడే ఉన్నారు. ఈ నెల 1న సికింద్రాబాదులోని మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని మరీ చంద్రబాబు టర్కీ వెళ్లారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో కుటుంబంతో కలిసి పర్యటించిన చంద్రబాబు అక్కడి నుంచే పలుమార్లు అధికారులతో కీలక అంశాలపై సమీక్షలు చేశారు. అక్కడి నుంచి రాగానే నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా లేక్ వ్యూ అతిథి గృహంలో ఆయన ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉంటారు.

  • Loading...

More Telugu News