: ఇలా కూడా పెను ప్రభావం చూపొచ్చు: 'బాహుబలి'కి వర్మ చురక!
మహేశ్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు'పై ప్రశంసల వర్షం కురిపిస్తూ, అదే సమయంలో 'బాహుబలి'పై పంచ్ వేశారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. 'బాహుబలి' కోలాహలం తర్వాత వచ్చిన 'శ్రీమంతుడు' సింప్లిసిటీతో ఎంతటి ప్రభావాన్ని చూపొచ్చో నిరూపించిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. వందల కోట్ల బడ్జెట్, వందలాది రోజులు షూటింగ్ జరుపుకుంటేనే కాదు, సింపుల్ కథాంశం, ప్లెయిన్ క్లోజప్స్ తోనూ పెను ప్రభావం చూపవచ్చని 'శ్రీమంతుడు' చాటి చెప్పిందని కితాబిచ్చారు. మహేశ్ వంటి నికార్సైన యాక్టర్ క్లోజప్ లో కనిపిస్తే ఆ ప్రభావం మామూలుగా ఉండదని, కంప్యూటర్ గ్రాఫిక్స్ తో క్రియేట్ చేసిన విజువల్ కంటే అదిరిపోతుందని 'బాహుబలి'కి చురక అంటించారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ విటోరియో స్టొరారో కూడా ఇదే విషయాన్ని చెప్పారని ట్వీట్ చేశారు.