: తక్కువ ధరకే మద్యం అమ్మాలని నిర్ణయించాం: కేసీఆర్


రాష్ట్రంలో మెరుగైన మద్యం విధానం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో నూతన మద్యం విధానంపై అబ్కారీ శాఖ మంత్రి పద్మారావు, అధికారులతో ఆయన శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన సమీక్ష వివరాలు వెల్లడించారు. గుడుంబాకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో తక్కువ ధరకే మద్యం అమ్మాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వమే మద్యం తయారుచేస్తుందని వివరించారు. నూతన మద్యం విధానానికి ఆగస్టు 15 తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని, అక్టోబరు 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News