: సంగక్కరా కాచుకో...!: సవాల్ విసిరిన ఇషాంత్


శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కాకముందే మాటల యుద్ధం షురూ అయింది. లంక పర్యటనలో భాగంగా టీమిండియా ఈ నెల 12 నుంచి తొలి టెస్టు ఆడనుంది. కాగా, ఈ సిరీస్ తో క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను లక్ష్యంగా చేసుకున్నాడు టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ. ప్రాక్టీసు మ్యాచ్ లో 5 వికెట్లు కూల్చిన ఈ ఢిల్లీ పేసర్ తన బౌలింగ్ లో సంగక్కరకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. "అతను తన దేశానికి ఆడుతున్నాడు, నేను నా దేశానికి ఆడుతున్నాను. ఐపీఎల్ లో కలిసి ఆడాం, కానీ, ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ముందుంది. సంగా తన చివరి గేమ్ ఆడుతున్నాడన్నది పట్టించుకోను, అతడిపై నిప్పులు చెరుగుతా!" అని ఇషాంత్ స్పష్టం చేశాడు. సంగక్కర, ఇషాంత్ ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ జట్టు తరపున ఆడారన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News