: రూ.100 కోట్లు ఇవ్వాలంటూ బీసీసీఐ ప్రముఖుడు శుక్లాకు బెదిరింపులు... పోలీసుల అదుపులో నెల్లూరు చిరువ్యాపారులు


రూ.100 కోట్లు ఇవ్వాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రముఖుడు రాజీవ్ శుక్లా (ఐపీఎల్ చైర్మన్)ను బెదిరిస్తున్న ఇద్దరు వ్యక్తులను నెల్లూరులో అదుపులోకి తీసుకున్నారు. వారు గత కొన్ని వారాలుగా శుక్లాకు బెదిరింపు కాల్స్ చేయసాగారు. తాము దావూద్ ఇబ్రహీం గ్యాంగు సభ్యులమని, తాము అడిగిన మొత్తం ఇవ్వకపోతే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని ఆయనను హెచ్చరించారు. ఈ-మెయిళ్లూ పంపారు. దాంతో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఉపయోగించిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలను ట్రాక్ చేయడం ద్వారా నెల్లూరు కేంద్రంగా ఈ తంతు సాగినట్టు గుర్తించారు. నెల్లూరు వెళ్లిన ఢిల్లీ పోలీసుల బృందం అక్కడ ఫతే, షేక్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. చిరువ్యాపారులైన ఆ ఇద్దరినీ ప్రశ్నించగా తాము దావూద్ గ్యాంగు సభ్యులమని చెప్పారట. దీంతో, ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఢిల్లీ స్పెషల్ పోలీసులు నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News