: ఏపీలో మూడో దశ రుణమాఫీ జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ లో మూడో దశ రుణమాఫీ జాబితా విడుదలైంది. దానికి సంబంధించిన జాబితాను ప్రభుత్వం apcbsportal.ap.gov.in/loanstatus/ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. బ్యాంకర్లు నమోదుచేయని 58వేల దరఖాస్తులను పునఃపరిశీలన చేసి పంపాలని ఆయా బ్యాంకు కేంద్ర కార్యాలయాలను కోరినట్టు ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. బ్యాంకు నుంచి వివరాలు రాగానే వాటిని ఆన్ లైన్ లో పెడతామని చెప్పారు. రుణ అర్హత లభించలేదని ఫిర్యాదులుంటే పంపవచ్చన్నారు. మొత్తం 3 దశల్లో మొత్తం 56 ఖాతాలను పరిష్కరించామని ఆయన వివరించారు.