: సుప్రీంకోర్టు జడ్జిని చంపేస్తామంటూ రాసిన లేఖపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పందన


యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేసిన నేపథ్యంలో, జడ్జ్ మెంట్ ఇచ్చిన ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒకరైన జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. "మీకు ఎంత సెక్యూరిటీ ఉన్నా పర్వాలేదు... మిమ్మల్ని ఖతం చేస్తాం" అంటూ రాసిన లేఖను దీపక్ మిశ్రా ఉంటున్న బంగళా వెనకవైపు గోడపై నుంచి లోపలకు విసిరేశారు. ఈ బెదిరింపు లేఖపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు స్పందించారు. "కేసులను సరైన విధంగా పరిష్కరించడమే మా కర్తవ్యం. మా డ్యూటీని ఎలాంటి భయం లేకుండా మేం నిర్వర్తిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులను ఎలా ఎదుర్కోవాలన్న విషయానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు విధివిధానాలున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News