: కేసీఆర్ కోసం టీ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాల నేతల నిరీక్షణ


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసేందుకు వివిధ పార్టీల నేతలు సచివాలయానికి క్యూ కట్టారు. సచివాలయంలోని సీఎం కార్యాలయం ఉన్న సమతా బ్లాకు ముందు వారంతా కేసీఆర్ పిలుపు కోసం పడిగాపులు గాస్తున్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తదితరాలపై సీఎంతో చర్చించేందుకు టీ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాలకు చెందిన నేతలు కొద్దిసేపటి క్రితం సచివాలయానికి చేరుకున్నారు. అయితే కేసీఆర్ నుంచి వారికి కబురు రాని నేపథ్యంలో సమతా బ్లాకు ముందే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సీఎం నుంచి వచ్చే పిలుపు కోసం వారంతా అక్కడ నిరీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News