: నేతన్నల జీవితం బాగుపడడానికి కొన్ని సినిమాలు చాలు: మోదీ
చెన్నైలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మద్రాస్ యూనివర్శిటీలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ... సినీ రంగం చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలని అన్నారు. సినిమాల కారణంగా దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయని, చేనేత నేపథ్యంలో కొన్ని సినిమాలు చాలని, తద్వారా నేత కార్మికుల జీవితాలు బాగుపడతాయని పేర్కొన్నారు. చేనేత అంశంతో సినిమాలు తీయడం, చేనేత ఉత్పత్తులు ఉపయోగించడం ద్వారా ఆ రంగానికి మేలుచేసిన వారవుతారని ఫిలిం మేకర్లను ఉద్దేశించి అన్నారు. పబ్లిసిటీ లోపించిన కారణంగానే చేనేత పరిశ్రమ అనాదరణకు గురైందని ఆయన అభిప్రాయపడ్డారు. చేనేత రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.