: ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని నీరుగార్చింది కాంగ్రెస్ సర్కారే: మంత్రి పీతల సుజాత
ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చేసిందని ఏపీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. గుంటూరు జిల్లాలో ర్యాగింగ్ నేపథ్యంలో జరిగిన రిషితేశ్వరి, సునీత ఆత్మహత్యల నేపథ్యంలో ర్యాగింగ్ పై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సుజాత గత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ర్యాగింగ్ చట్టం కోరలు ఊడిపోయాయని, ఈ క్రమంలోనే రాష్ట్రంలో ర్యాగింగ్ జడలు విప్పిందని ఆమె ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం ర్యాగింగ్ నిరోధక చట్టానికి పదును పెడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. రిషితేశ్వరి ఘటనకు సంబంధించి నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు.