: ప్రకాశం జిల్లా జంట హత్యల కేసులో 9 మందికి జీవిత ఖైదు


ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం అమ్మవారిపల్లెలో జరిగిన జంట హత్యల కేసులో 9 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మార్కాపురంలోని ఆరో జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు. 2011లో జరిగిన ఈ జంట హత్యల కేసు జిల్లాలో కలకలం రేపింది. ఘటన జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు కోర్టుకు సాక్ష్యాలను సమర్పించారు. నాలుగేళ్ల పాటు కొనసాగిన ఈ కేసు విచారణ నిందితులకు జీవిత ఖైదుతో నేటితో ముగిసింది.

  • Loading...

More Telugu News