: మాపై కేంద్రానికి ఉన్నది సవతి తల్లి ప్రేమే!: యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఆరోపించారు. కేంద్రంతో రాష్ట్రానికి ఎలాంటి సంబంధాలున్నాయన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సంభవించిన అకాల వర్షాలతో రైతాంగం పూర్తిగా నష్టపోయిందని ఆయన చెప్పారు. దీంతో, రైతులను ఆదుకునేందుకు రూ. 7 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే రూ. 2,800 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుందని... చివరకు అది కూడా ఇవ్వలేదని విమర్శించారు. చివరకు తామే రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ. 3,500 కోట్ల పరిహారం అందించామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం 'విభజించు... పాలించు' అనే సూత్రాన్ని పాటిస్తోందని మండిపడ్డారు.