: తెలంగాణలో బయోమెట్రిక్ రేషన్ కార్డుల జారీ... ఒక్కో కార్డు వెల రూ.6


తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. పేద ప్రజలకు రేషన్ పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ వినూత్న కార్యక్రమానికి తెర తీస్తున్నట్లు ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఆయన అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చెలామణిలో ఉన్న రేషన్ కార్డులన్నింటినీ తొలగించి వాటి స్థానంంలో బయోమెట్రిక్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్డుల కోసం లబ్ధిదారులు రూ.6 చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజా పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఉద్దేశించిన ఈ కార్డులను తొలుత రంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News