: హరీశ్ వ్యాఖ్యలపై దేవినేని అసహనం...కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందని సూచన
మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ సర్కారు కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి ఆ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేదానికి అనవసర రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. ఆగస్టు మూడో వారంలో కృష్ణా డెల్టాకు నీరిస్తామని దేవినేని ప్రకటించారు.