: రిషితేశ్వరి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు... తీర్పు వాయిదా
నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై గుంటూరు జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును న్యాయమూర్తి ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ విద్యార్థి జేఏసీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది.